Harish Rao: కేసీఆర్‌ నీకు జీవితంలో అర్థం కాడు.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్

by Gantepaka Srikanth |

హన్మకొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కౌంటర్ ఇచ్చారు.

Harish Rao: కేసీఆర్‌ నీకు జీవితంలో అర్థం కాడు.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి’ అని ఎద్దేవా చేశారు. పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదని అన్నారు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండని విమర్శించారు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘కేసీఆర్(KCR).. కేసీఆర్.. అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి నీకు జీవితంలో అర్థం కాడు’ అని అన్నారు. ‘తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్‌లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు. నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం’ అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story