Hyderabad : బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు బెయిల్ మంజూరు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-29 17:29:11  IST  )

హైదరాబాద్‌లోని మహా న్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం దాడి చేసిన విషయం తెలిసిందే.

Hyderabad : బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మహా న్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(BRSV) అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌(Gellu Srinivas Yadav)తో సహా మరో14 మందిని అరెస్ట్ చేయగా.. వారందరికీ నేడు ఎల్బీ నగర్ కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మహా న్యూస్ తప్పుడు కథనాలు ప్రసారం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో కార్యాలయ అద్దాలు, బయట పార్క్ చేసిన కార్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నారా లోకేష్, బీజేపీ నేత బండి సంజయ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. అయితే బెయిల్ మంజూరైనప్పటికీ, ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

Next Story