Ex Minister: తెలంగాణ కేబినెట్‌లో ఆరు ఖాళీలు.. పోటీలో 32 మంది ఎమ్మెల్యేలు

by Gantepaka Srikanth |
Ex Minister: తెలంగాణ కేబినెట్‌లో ఆరు ఖాళీలు.. పోటీలో 32 మంది ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఎప్పుడు కూలుతుందో తెలియదని బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) విమర్శలు చేశారు. మంగళవారం మహబూబాబాద్‌లో ఎర్రబెల్లి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందోనని భయం భయంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గడుపుతున్నాడని.. అందుకే ఉన్నన్ని రోజులు దోచుకోవాలని చూస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. కేబినెట్‌(Telangana Cabinet)లో ఆరు ఖాళీలు ఉంటే.. పోటీలో మాత్రం 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విమర్శించారు. అతి త్వరలో మంత్రి పదవి రాని నేతలంతా బయటకు వస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కేవలం.. 10 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఉన్నాయని అన్నారు. మిగిలిన 110 నియోజకవర్గాల్లో ప్రజలు తిరగబడుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిలు మంత్రి పదవి విషయంలో మనసులోని మాట బయటపెడుతున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.



Next Story

Most Viewed