BRS: అప్పుడే మంచిగా ఉండే.. బీఆర్ఎస్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం

by Ramesh Naini |

అప్పుడే మంచిగా ఉండే.. మా గ్రామం నుంచి పోరాటం అంటూ (BRS) బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమం మొదలు పెట్టింది.

BRS: అప్పుడే మంచిగా ఉండే.. బీఆర్ఎస్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం
X

దిశ, డైనమిక్ బ్యూరో: (appude manchiga Unde) అప్పుడే మంచిగా ఉండే.. మా గ్రామం నుంచి పోరాటం అంటూ (BRS) బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ మేరకు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, నాయకులు భూక్యా జాన్సన్ నాయక్ తదితర నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ, గ్రామాల నుంచే మళ్లీ పోరాటం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఏళ్ల తరబడి సంపాదించుకున్న అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం ఇవన్నీ మళ్ళీ తిరిగి పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి, ప్రతి గ్రామం నుంచి ముందుకు వచ్చే గొంతుల సమావేశం ఇది అంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, అప్పుడే మంచిగా ఉండే.. అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, 24 గంటల కరెంటు, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, ఆసరా పెన్షన్ వంటి నాటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

Next Story