‘రేవంత్‌ రెడ్డికి రక్తదానం’.. తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ.. నేడు తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది.

‘రేవంత్‌ రెడ్డికి రక్తదానం’.. తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ.. నేడు తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. రైతులకు సంఘీభావం తెలుపుతూ.. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్‌వై ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, బీఆర్ఎస్ నేతలు అక్కడ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రక్తదాహం తీర్చేందుకు విద్యార్థి విభాగమంతా రక్తదానం చేస్తోందని, ఆ రక్తాన్ని సీఎం నివాసానికి తీసుకెళ్లి ఇస్తామని తెలిపారు.

రక్తదానం పూర్తయ్యాక బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు బ్లడ్ ప్యాకెట్లతో సీఎం నివాసానికి వెళ్లేందుకు బయల్దేరారు. అప్పటికే తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి తరలించారు.

Next Story