ఓటు చోరీపై ఎన్నికల సీఈఓ ముందు బీఆర్ఎస్ మూడు కండిషన్లు.. సీఈవోకు కేటీఆర్ ఫిర్యాదు

by Ramesh Naini |   (  Updated:2025-10-13 12:52:04  IST  )

ఓటు చోరీపై ఎన్నికల సీఈఓ ముందు బీఆర్ఎస్ మూడు కండిషన్లు.. సీఈవోకు కేటీఆర్ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (vote chori) ఓటు చోరీపై ఎన్నికల సీఈఓ (CEO) ముందు బీఆర్ఎస్ (BRS) మూడు కండిషన్లు ఉంచింది. సోమవారం ఓటు చోరీ ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఇతర నాయకులు కలిసి ఫర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సీఈఓ ముందు బీఆర్ఎస్ మూడు కండిషన్లు పెట్టింది. ఓటు చోరీపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరగాలి, క్షేత్రస్థాయిలో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలి, నామినేషన్ ప్రక్రియ ముగిసేలోపు విచారణ పూర్తి చేయాలి.. బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ అని గగ్గోలు పెడుతున్నాడని, ఇక్కడేమో.. దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దొంగ ఓట్లపై ఆధారాలతో సహా సీఈవోకి సమర్పించి, ఎంక్వైరీ చేయమని కోరినట్లు తెలిపారు.

ఇవాళ 3, 4 రకాల దొంగ ఓట్లను ఓట్లలో చేర్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 20 వేల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసినట్లు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో 250 ఓట్లు, 180 ఓట్లు, 80 ఓట్లు, 90 ఓట్లు ఉన్నాయి.. ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే, ఆ ఇంటి యజమాని వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు. ఇంకో ఇంటికి వెళ్లి చెక్ చేశాం.. వాళ్ళ ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి, ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు.. ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు ఆ నియోజకవర్గంలో నమోదు అయ్యాయి. ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈవోకు ఫిర్యాదులో ఇచ్చామన్నారు.

Next Story