ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

by Malleboina Mahesh |   (  Updated:2026-03-28 14:58:15  IST  )

"ఆర్టీసీని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్‌కు దానిపై మాట్లాడే హక్కు లేదు. 'మహాలక్ష్మి'తో ఆర్టీసీకి పూర్వవైభవం తెస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని, ఆర్టీసీ గురించి బీఆర్ఎస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. బీసీలకు సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ వాకౌట్ చేయడం సమంజసం కాదని, వాకౌట్ పేరుతో బీసీలను అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం శాసనసభలో బీసీ సంక్షేమం, రవాణా, హోం శాఖ బడ్జెట్ చర్చలో భాగంగా మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేసిందని మంత్రి విమర్శించారు.

గత పదేళ్లలో ఆర్టీసీకి ఒక్క ఎండీనీ నియమించలేదని, నియామకాలు చేపట్టలేదన్నారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఒక్క బస్సును కొనుగోలు చేయలేదని, నియామకాలు చేపట్టలేదని, ఆర్టీసీ సమ్మె పై ఉక్కుపాదం మోపారని, 45 వేల మంది కార్మికులను ఇబ్బందులకు గురి చేసిందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీని మూసేస్తామని నిర్వీర్యం చేసే కుట్ర చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

బీఆర్ఎస్ సభ్యులు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ సీపీ బహిరంగంగా ఫైరింగ్ చేస్తే, సీపీ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సీపీపైన ఎందుకు అంత ప్రేమ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరు తెస్తున్న సీపీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతమైన విమర్శలకు తావులేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. దానం నాగేందర్ మాట్లాడుతూ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సమంజసం కాదని, కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. బీసీ బంధు పెట్టాలని, మున్నూరు కాపు భవన్ కి 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో శివుని చిత్రపటంతో మంత్రి పొన్నం.. ప్రతిపక్షం అభ్యంతరం

Next Story