KA Paul : ఎస్ఎల్బీసీపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : కేఏ పాల్

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Prajashanthi Party Cheif KA Paul) విచారం వ్యక్తం చేశారు.

KA Paul : ఎస్ఎల్బీసీపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : కేఏ పాల్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Prajashanthi Party Cheif KA Paul) విచారం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్(BRS) నేతలకు లేదని అన్నారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి ఉన్న తీరిక టన్నెల్ వద్దకు వెళ్లేందుకు లేదా అని ప్రశ్నించారు. దేశంలో 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, అయితే కేంద్రం తీసుకు వస్తున్న డీలిమిటేషన్ ను అందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. డీలిమిటేషన్(Delimitation) పేరుతో ఉత్తరభారత్‌లో ఎంపీ స్థానాలు పెంచి, దక్షిణభారత్‌లో తగ్గించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో తెలుగు(Telugu), తమిళ్(Tamil), మలయాళం(Malayalam), కన్నడ(Kannada) భాషలు లేకుండా చేయాలని కేంద్రం చూస్తోందని పేర్కొన్నారు. సౌత్ ప్రజలు దీనిని ప్రారభంలోనే అడ్డుకోవాలని, లేదంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story