TG News : బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Muthe.Rajitha |

గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) మరోసారి విరుచుకు పడ్డారు.

TG News : బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) మరోసారి విరుచుకు పడ్డారు. ఆదివారం నల్గొండ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్(KCR) హయాంలో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మీద ధ్యాసపెట్టి దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు మీద కాకుండా దక్షిణ తెలంగాణలోని నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టి ఉంటే.. కందమల్ల, డిండి, ఎస్ఎల్బీసీ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయ్యేవి అన్నారు.

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు(SLBC Project)లో ప్రమాదం వలన పనులు ఆగిపోయాయని, కేంద్రంతో సంప్రదింపులు జరిపి తిరిగి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తమ హయాంలోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని, అలాగే కందమల్ల ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఏడాది బడ్జెట్ లో రూ.23 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు కేటాయించడమే ఇందుకు నిదర్శనం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story