- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాజెక్టుల భూ సేకరణ కోసం రూ.5 వేల కోట్లు: మంత్రి ఉత్తమ్
ప్రాజెక్టుల భూసేకరణకు రూ. 5వేల కోట్లు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన వివిధ ప్రాజెక్టుల భూసేకరణకు జూన్2 లోపు నిధులు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ భూసేకరణ కోసం రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఇవాళ హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి, శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ, సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, కలెక్టర్లు హాజరైన ఈ సమీక్షలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ను కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని విమర్శించారు.
సోర్సును మార్చి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం:
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి సోర్సును శ్రీశైలనానికి మార్చివేశారని, నీటి సోర్సును మార్చి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కాళేశ్వరంలో చేసిన పొరపాటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చేశారని విమర్శించారు. ఎంత ఖర్చయినా సరే ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులపై రూ.22 వేల కోట్లు ఖర్చు చేస్తామని డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్‍బీసీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ పూర్తి చేస్తామన్నారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.






