- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందు రోడ్లపై గుంతలు పూడ్చండి.. ట్రాఫిక్ చలాన్లపై సీఎం రేవంత్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఫైర్
ట్రాఫిక్ చలాన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీఆర్ఎస్ ఫైర్ అయింది. ఈ మేరకు ఇవాళ (మంగళవారం) తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ట్రాఫిక్ చలాన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీఆర్ఎస్ ఫైర్ అయింది. ఈ మేరకు ఇవాళ (మంగళవారం) తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ చలాన్లు నేరుగా పోలీసు వాళ్ళ అకౌంట్లలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డికి కనీసం రాజ్యాంగ స్ఫూర్తి లేదు.. అవగాహన లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విచ్చలవిడి అవినీతి, దోపిడీ చేస్తున్నారని, గ్రూప్1 పరీక్షలను అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలి ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చలాన్లు వేసే ముందు రోడ్ల మీద గుంతలు పూడ్చాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖత్వంగా, చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క పదం బయటకు వచ్చిన దానికి చట్టబద్ధత ఉంటుందని, లేకపోతే ప్రభుత్వం, జోకర్‌గా మిగిలిపోతుందన్నారు.
నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా?
ట్రాఫిక్ చలాన్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై సీఎంకు ఐదు పేజీల లేఖ రాస్తున్నాట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ఏమైనా దేశానికి రాజా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదురుతుందా? అని నిలదీశారు. ఎవరితోనైనా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారా.. లేక మీటింగుల్లో నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా? అని సీఎంను ప్రశ్నించారు. ప్రజల బ్యాంకుల ఖాతాలను దోచుకుతినాలని చూస్తున్నారు.. దోచుకోవడం కోసమే సీఎం అయ్యారా? అని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రభుత్వం సొమ్ము పేదలకు ఇవ్వాలని అంటుంటే రేవంత్ రెడ్డి పేదల డబ్బు దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ విధానమా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి వాడుతున్న కార్లపై మూడు చలాన్లు..
ఇష్టం వచ్చినట్లు అకౌంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం రేవంత్ రెడ్డికి లేదన్నారు. క్యాబినెట్ మంత్రులతో చర్చించి రేవంత్ రెడ్డి చలాన్లపై ప్రకటన చేశారా? అడ్వకేట్ జనరల్‌తో రేవంత్ రెడ్డి మాట్లాడారా? అని ప్రశ్నించారు. పింఛన్లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆటో క్రెడిట్ రేవంత్ రెడ్డి ఎందుకు చేయడం లేదన్నారు. ట్రాఫిక్ చలాన్లతో మొదలుపెట్టి నల్లా బిల్లులు, ఇంటి పన్ను బిల్లులు మొత్తం ఆటో డెబిట్ రేవంత్ రెడ్డి చేస్తారేమో? అనుమానం వ్యక్తం చేశారు. నోరు జారితే చలాన్లు ఉండొద్దా రేవంత్ రెడ్డి? అని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి తిట్టిన ప్రతిసారి ఎవరు ఆటో డెబిట్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి వాడుతున్న కార్లపై మూడు చలాన్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లపై చట్టం చేయరు.. ఒకవేళ చట్టం చేసినా కోర్టులు కొట్టివేస్తాయన్నారు.






