BRS: కేవలం మార్కుల గురించే కాదు.. ఇది యువత భవిష్యత్తు కోసం కూడా

by Gantepaka Srikanth |

గ్రూప్-1 పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

BRS: కేవలం మార్కుల గురించే కాదు.. ఇది యువత భవిష్యత్తు కోసం కూడా
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల హైకోర్టు వెలువరించిన 220 పేజీల తీర్పుతో యువతకు న్యాయం జరిగిందన్నారు. ఈ పరీక్ష కేవలం మార్కుల గురించి కాదని.. ఇది యువత భవిష్యత్తు, న్యాయం, విశ్వాసం గురించి అని తెలిపారు. రెండుసార్లు పరీక్ష రద్దయినా కమిషన్ పాఠం నేర్చుకోలేదని హైకోర్టు తేల్చిందన్నారు. అనుభవం లేని రిటైర్డ్ ఫ్యాకల్టీ, కోచింగ్ ట్యూటర్లను మూల్యాంకనలో పెట్టడం, 1.26 లక్షల స్క్రిప్టులు 90 రోజుల్లో, ఒక్కో పేపర్ 2–3 నిమిషాల్లోనే చెక్ చేయడం, మోడరేషన్ లేకుండా మూల్యాంకనం జరగడం, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగడంతోపాటు తదితర అంశాలను హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ అన్యాయాల వల్ల నిజమైన అభ్యర్థుల నమ్మకం దెబ్బతిందని, తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. టీజీపీఎస్సీపై న్యాయపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, బీఆర్ఎస్‌వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు పాల్గొన్నారు.

Next Story