- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
86 నియోజకవర్గాల్లో బీఎల్ఏల నియామకం.. సీఈవోకు బీఆర్ఎస్ కీలక విజ్ఞప్తి
తెలంగాణలో త్వరలో ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో త్వరలో ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో బోగస్ ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదు, ఓటరు వివరాల సవరణ చేపడతారు. ఈ ప్రక్రియలో BLA (Booth Level Agent) క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. అయితే.. ఈ బీఎల్‌ఏల నియామకం పారదర్శకంగా జరగడం లేదని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డిని కలిశారు. SIR జరిగే 86 నియోజకవర్గాల్లో బూత్ స్థాయి ఏజెంట్ల (BLA) నియామకం పారదర్శకంగా జరిగేలా చూడాలని వారు సీఈవోకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం బూత్ స్థాయి ఏజెంట్ల (BLA) నియామక అధికారాన్ని ఆయా నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇచ్చారని, ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జులకు ఆ అధికారం అప్పగించారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బీఎల్‌ఏ నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, నిబంధనల ప్రకారం నియామకాలు జరిగేలా చూడాలని వారు సీఈవోను కోరారు. ఓటర్ల జాబితా సవరణలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదని, అర్హులైన ఒక్క ఓటరును కూడా జాబితా నుండి తొలగించవద్దని వారు స్పష్టం చేశారు. బూత్ స్థాయి ఏజెంట్లు సమర్థవంతంగా విధులు నిర్వహించేలా వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షిక వాతావరణంలో జరిగేలా చూడటంలో ఎన్నికల సంఘం చొరవ చూపాలని బీఆర్ఎస్ బృందం కోరింది.






