- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Komatireddy Venkat Reddy: సినిమా ఓపెనింగ్‌కి హెలికాప్టర్? మంత్రి కోమటిరెడ్డి పై విమర్శల వెల్లువ
తెలంగాణలో మంత్రులు హెలికాప్టర్‌ను షేర్ ఆటోల వాడేస్తున్నారని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మంత్రులు (helicopter) హెలికాప్టర్‌ను షేర్ ఆటోల వాడేస్తున్నారని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇవాళ (సోమవారం) సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) రామోజీ ఫీల్మ్ సిటీ, తిరుమలగిరికి హెలికాప్టర్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటిలో ఓ సినిమా ప్రారంభోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిరుమలగిరిలో పబ్లిక్ మీటింగ్, రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలు ముంగించుకోని తిరిగి బేగంపేటకు హెలికాప్టర్‌లో రానున్నారు. అయితే, ఈ హెలికాప్టర్ పర్యటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చకు దారితీసింది.
నగర శివారులోని ఫిల్మ్ సిటీకి హెలికాప్టర్ వాడకం, అందులోనూ సినిమా ప్రారంభోత్సవం వంటి కార్యక్రమానికి ప్రభుత్వ హెలికాప్టర్ వాడకం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే (BRS) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎక్స్ వేదికగా మంత్రిపై ఫైర్ అయ్యారు. ‘ఇవాళ సినిమా ఓపెనింగ్‌కి హెలికాప్టర్? రేపు బర్త్‌డేకి బుల్లెట్ ట్రైన్? ఎల్లుండి రోజునా ఏదైనా ఫంక్షన్‌కి ఫైటర్ జెట్? అప్పు పుట్టకపోతే ఏంటి? తెలంగాణను తాకట్టు పెడుతూ? ప్రజల రక్తాన్ని పీల్చుతూ రాజభోగాలు అనుభవించడమే కదా కాంగ్రెస్ నైజం? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ట్వీట్..






