TG: సర్పంచ్‌లకు స్పీకర్ విషెస్.. బీఆర్ఎస్ అభ్యంతరం

by Gantepaka Srikanth |

TG: సర్పంచ్‌లకు స్పీకర్ విషెస్.. బీఆర్ఎస్ అభ్యంతరం

TG: సర్పంచ్‌లకు స్పీకర్ విషెస్.. బీఆర్ఎస్ అభ్యంతరం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన అభ్యర్థులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) శుభాకాంక్షలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై తాజాగా బీఆర్ఎస్(BRS) అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది.

‘‘స్పీకర్ గడ్డం ప్రసాద్ గారూ.. ఒక బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉన్న మీరు, రాష్ట్రంలో ఉన్న పార్టీలను, ప్రజలందరినీ సమానంగా చూడాలి. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీరు, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారికి మాత్రమే శుభాకాంక్షలు చెప్పడం సరైన పద్దతి కాదు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మీరు చేసిన ఇలాంటి చర్యలు శాసన సభాపతి పదవికి కళంకం. ఇలాంటి పక్షపాత ధోరణితోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద కూడా తీర్పులు ఇచ్చారా?’’ అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.

Next Story