Srinivas Goud: దానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-29 15:17:35  IST  )

కాంగ్రెస్‌కు బీసీలపై ఉన్నదంతా విషమే అని.. బీసీల ఓట్లు వేయించుకొని మోసం చేసిందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

Srinivas Goud: దానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌కు బీసీలపై ఉన్నదంతా విషమే అని.. బీసీల ఓట్లు వేయించుకొని మోసం చేసిందని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌తోనే కాంగ్రెస్ గెలిచిందని.. రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్స్ ఒక్కరూ లేరని అన్నారు. కేసీఆర్ ఒక్క ఎంపీగా ఉండి తెలంగాణ తెచ్చారని.. 311 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ బీసీ బిల్‌ను ఎందుకు పాస్ చేపించడం లేదని ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ఏమైందని ప్రశ్నించారు. గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌పై ఇంకా క్లారిటీ రాలేదని.. జీవో తెస్తామంటూ మళ్లీ కాంగ్రెస్ కొత్త డ్రామా స్టార్ట్ చేసిందని అన్నారు. తమ పార్టీ 42 శాతానికి వ్యతిరేకం కాదని చెప్పారు. రిజర్వేషన్లు బీసీలకు భిక్ష కాదని.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. తమిళనాడు మాదిరి కాంగ్రెస్ భూ స్థాపితం అవుతుందన్నారు. మోసానికి పరాకాష్ట కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్, శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు.

Next Story