మున్సిపల్ ఫలితాల వేళ షాకింగ్.. బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్?

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబును కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారని.. అతని భార్య నాగమణి ఆరోపిస్తోంది. తన భర్తను తక్షణమే వదిలి పెట్టాలని వేడుకుంటోంది.

మున్సిపల్ ఫలితాల వేళ షాకింగ్.. బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్?
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్‌(Kothagudem Corporation)లో 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబును కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారని.. అతని భార్య నాగమణి ఆరోపిస్తోంది. తన భర్తను తక్షణమే వదిలి పెట్టాలని వేడుకుంటోంది.

ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ పార్టీ ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని అత్యధిక వార్డుల్లో విజయం సాధించిన ఎర్రదళం.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రెడీ అయింది. అయితే మెజార్టీకి అవసరమైన స్థానాలు రాకపోవడంతో.. సీపీఐకి ఇతర పార్టీల మద్దతు అవసరం కానుంది. ఇప్పటికే మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. దీనిపై సీపీఐ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది.

Next Story