BRS : రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ భేటీ!

by Y. Venkata Narasimha Reddy |

రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యల(Farmer Suicides)పై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ(BRS Study Committee)తొలి సమావేశం ప్రారంభమైంది.

BRS : రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యల(Farmer Suicides)పై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ(BRS Study Committee)తొలి సమావేశం ప్రారంభమైంది. కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former Minister Niranjan Reddy)అధ్యక్షతన మంచిరేవులలోని ఆయన నివాసంలో ప్రారంభమైన సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, అంజయ్య యాదవ్, రసమయి బాలకిషన్, యాదవ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డిలు హాజరయ్యారు.

రైతు ఆత్మహత్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సహాయంపై మాటమార్చడం, రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటీ కష్టాలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభ పరిస్థితులు, వరుసగా జరిగే రైతు ఆత్మహత్యలపై తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రభుత్వానికి చేయాల్సిన సూచనలపై సమావేశంలో చర్చించనున్నారు.

Next Story