- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR: కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భరోసా
తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య (Constable Kistaiah) కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కేసీఆర్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో తన ప్రాణాలను బలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్నీ తానై కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వైద్యవిద్యలో ఆసక్తి కనబరిచిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని నేడు కేసీఆర్ కిష్టయ్య భార్యా పిల్లలకు అందించారు. కాగా.. అమరుడు కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకున్న కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని భరోసా ఇచ్చారు.






