Sarpanch elections: కేటీఆర్ హవా.. సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ప్రభంజనం

by Ramesh Naini |

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Sarpanch elections: కేటీఆర్ హవా.. సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ప్రభంజనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రెండో దశలోనూ కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్ధులే ఆధిక్యంలో ఉన్నారు. రెండో విడతలో రాత్రి తొమ్మిది గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 2077, బీఆర్ఎస్ 1097, బీజేపీ 241, ఇతరులు 597 అభ్యర్థులు గెలిచారు. అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ప్రభంజనం కొనసాగింది. 30 సర్పంచ్ స్థానాలకు గాను బీఆర్ఎస్ 20 స్థానాలు గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మూడవ స్థానంలో నిలిచి డిపాజిట్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ పార్టీ మాత్రం దరిదాపుల్లో కూడా లేనట్లు కనబడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గంలో కేటీఆర్ హవా నడుస్తోంది

Next Story