ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS ద్రోహం చేసింది.. ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 17:53:32  IST  )

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ (CP Radha Krishna) ఎన్నికయ్యారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS ద్రోహం చేసింది.. ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ (CP Radha Krishna) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Sudershan Reddy)పై విజయం సాధించారు. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 13 మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. అందులో బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన ఎంపీలు నలుగురు, బీజేడీ (BJD)కి చెందిన ఎంపీలు ఏడుగురు, అకాళీదల్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ సభ్యుడు మరొకరు ఉన్నారు. ఈ క్రమంలోనే ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్‌పై తాజాగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdary) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండి ప్రజస్వామ్యన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. కాళేశ్వరంపై CBI విచారణ ఉన్నందుకే ఆ పార్టీ ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని కామెంట్ చేశారు. ఏది ఏమైనా గెలుపోటములు కేవలం రాజకీయ నెంబర్‌ మాత్రమేనని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS పార్టీ దూరంగా ఉండి క్షమించరాని తప్పు చేసింని.. అది భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని రేణుకా చౌదరి అన్నారు.

Next Story