- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ : Yadadriలో KCRతో భేటీ కానున్న ముగ్గురు సీఎంలు
ఖమ్మంలో బుధవారం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ముగ్గురు సీఎంలు రానున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మంలో బుధవారం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రానున్నారు. రేపు రాత్రికి హైదరాబాద్‌కు ముగ్గురు సీఎంలు, జాతీయ నేతలు చేరుకోనున్నారు. రెండు హెలికాప్టర్‌లలో యాదాద్రికి ముగ్గురు సీఎంలు, జాతీయ నేతలు చేరుకుంటారు. అక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ఖమ్మం బహిరంగ సభకు వెళ్లనున్నారు. యాదాద్రిలోనే సీఎం కేసీఆర్ తో ముగ్గురు సీఎంలు భేటి కానున్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో నలుగురు సీఎంలు కలిసి బోజనం చేస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. 18న నలుగురు సీఎంల చేతుల మీదుగా రెండో విడత కంటివెలుగు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
Next Story






