- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: కేటీఆర్ పై కథనాలు.. మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి
మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని ఓ మీడియా చానల్ ఆఫీస్ (Attack on media office) పై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ డోర్లు, స్టూడియోతో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ తెలుగు న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ చానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నాయకులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఘటన:
టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు కొంత మందితో ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు. గత కొన్ని నెలలుగా మీడియా ముసుగు వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నా పైన వ్యక్తిగతంగా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారు. అలాంటి వ్యక్తుల వల్ల కానీ వారు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు నాపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించవు. కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన మా కుటుంబ సభ్యులపైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయన్నారు.
మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. కలిసికట్టుగా వెనుక ఉండి నడిపిస్తున్న వారితోపాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ హెచ్చరిక చేసిన తర్వాతే ఈ ఘటన జరగడం గమనార్హం.






