- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: సజ్జనార్ కు రూ.8 కోట్ల చెక్కు అందజేసిన బీఆర్ఎస్ పార్టీ.. కారణం ఇదే
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు బీఆర్ఎస్ పార్టీ రూ. 8 కోట్ల చెక్కు అందజేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై (BRS Silver Jubilee Celebration) పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ రజతోత్సవ సభను భారీ జనసందోహం మధ్య నిర్వహించి తమ బలమేంటో అధికారపక్షానికి చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జనసమీకరణపై దృష్టి సారించిన పార్టీ తాజాగా సభ కోసం తమకు 3 వేల బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీని (TG RTC) కోరింది. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను (Sajjanar) బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్ కలిసి విజ్ఞప్తి చేశారు. అద్దె కోసం అవసరమైన రూ. 8 కోట్ల చెక్కును సజ్జనార్‌కు అందజేశారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తమ మీటింగ్‌లకు ఆర్టీసీ బస్సులను తాము అద్దెకు కోరినా ఇవ్వలేదని గతంలో కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. అయితే బీఆర్ఎస్ సభ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.






