- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోదరులు, బామ్మర్ది కోసం ఫ్యూచర్ సిటీనా.. CMపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఫార్మాసిటీ (Pharma City) కోసం భూములు ఇచ్చి రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని రైతులు అవస్థలు పడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫార్మాసిటీ (Pharma City) కోసం భూములు ఇచ్చి రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని రైతులు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే.. ఫార్మాసిటీని రద్దు చేస్తామని, రైతులు భూములను తిరిగి ఇచ్చేస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే యాచారం మండల పరిధిలోని మేడిపల్లి (Medipally) గ్రామస్థులు తమ భూములు తమకు ఇవ్వాలని పోరుబాట పట్టారు. ఈ క్రమంలోనే రేడియల్ సర్వే (Radial Survey) కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని నిరసన తెలిపారు. తాము ఇచ్చిన భూమును ఫార్మాసిటీకే ఉపయోగిస్తామని చెప్పి.. క్షేత్రా స్థాయిలో మాత్రం ఫ్యూచర్ సిటీకి భూములను కేటాయిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ రైతులు పోరాటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఇచ్చిన హామీలను విస్మరించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడం, అధకారిక వేదింపులు, సిగ్గులేని భూ కబ్జాలు కాంగ్రెస్ పాలనలో నాలుగు మూల స్తంభాలంటూ ఫైర్ అయ్యారు. లగచర్ల గిరిజన రైతులైనా, కంచ గచ్చిబౌలి అటవీ భూములైనా.. నేటి హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములైనా సర్కార్ దురగతాలు ఒక్కటేనని అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా సిటీ రైతుల భూములను తిరిగివ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారితో చర్చలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ నిలువునా మోసం చేసి.. అనుముల సోదరులు.. రేవంత్ బావమరిది కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారా అని కేటీఆర్ కామెంట్ చేశారు.






