టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ

by Ramesh Naini |

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు.

టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో హైదరాబాద్ బ్రిటిష్ హై కమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురామన్ తో కలిసి డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాద పూర్వకంగా కవితను కలిశారు. ఈ మేరకు కవిత ఆయనను శాలువాతో సత్కరించారు. కాసేపు వారితో కీలక చర్చలు జరిపారు. భారత్-యునైటెడ్ కింగ్ డమ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Next Story