- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి.. ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీశ్ ఫైర్
హైదరాబాద్ (Hyderabad)లోని ఎర్రగడ్డ (Erragadda) మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషితాహారం తిని ఒకరు మృతి చెందగా.. 90 మందికి పైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లోని ఎర్రగడ్డ (Erragadda) మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషితాహారం తిని ఒకరు మృతి చెందగా.. 90 మందికి పైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదే ఘటనపై తాజాగా బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఇవాళ ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటన దురదృష్టకరని అన్నారు. తమ పాలన గొప్ప అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ వేములవాడలో కోడెలకు మేత పెట్టడం లేదని.. ఎర్రగడ్డలో మానసిక రోగులకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. అసలే ఆరోగ్యం బాగోలేక వాళ్లు ఆసుపత్రిలో చేరితే.. ఏకంగా వారి ప్రాణాలే పోయే పరిస్థితిని తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు.
ఆహారం విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని.. ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు. వేములవాడ (Vemulawada) ఆలయంలో కోడెల మృతి తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే.. బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించాలని హరీశ్ రావు కామెంట్ చేశారు.
ఎవరికీ ప్రాణాపాయం లేదు.. మంత్రి దామోదర
తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) స్పందించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 92 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారందరికీ ఉస్మానియా (Osmania), గాంధీ (Gandhi) ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని.. మరో రెండు రోజుల్లో అందరూ కోలుకుంటారని అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై కమిటీ రిపోర్టు వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దామోదర రాజనర్సింహ అన్నారు.






