KTR : తెలంగాణ పర్యాటకులను క్షేమంగా తీసుకు రండి : కేటీఆర్

by Muthe.Rajitha |

జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే.

KTR : తెలంగాణ పర్యాటకులను క్షేమంగా తీసుకు రండి : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ భీకర ఉగ్రదాడికి వణికిపోయిన వేలాది మంది టూరిస్టులు కాశ్మీర్ ను వీడుతుండగా.. శ్రీనగర్ లోని ఎయిర్పోర్టు, బస్ స్టేషన్లు పర్యటకులతో కిక్కిరిసి పోయాయి. కాగా శ్రీనగర్ లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ టూరిస్టులు(Telangana Tourists) తమకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

దీనిపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. శ్రీనగర్ లో చిక్కుకు పోయిన 80 మంది తెలంగాణ పర్యాటకులను హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రస్తుతం వారంతా క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకు పోయారని, వారిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పహల్గాంలో చిక్కుకున్న వేలాది మంది టూరిస్టులను అధికారులు సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఇంకా వందలమంది శ్రీనగర్లోనే చిక్కుకు పోయినట్టు సమాచారం.

Next Story