BREAKING: తండ్రిది ఏ కులమో.. అదే కులం కన్నబిడ్డకు వర్తిస్తుంది: ఆరూరి రమేష్‌కు కడియం కౌంటర్

by Disha Web Desk 1 |
BREAKING: తండ్రిది ఏ కులమో.. అదే కులం కన్నబిడ్డకు వర్తిస్తుంది: ఆరూరి రమేష్‌కు కడియం కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో డైలాగ్ వార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చిగడ్డి వేస్తే.. భగ్గుమనేలా కనిపిస్తోంది. నిన్న ప్రెస్‌మీట్ పెట్టిన వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యపై కుల, మత పరమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కామెంట్స్‌కు కడియం శ్రీహరి ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమపై లేనిపోని ఆరోపణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని మరీ కాంగ్రెస్‌లో చేరానంటూ ఆవాస్తవాలను ప్రచారం చేయడం బాధకరమని అన్నారు. ఆ ఆరోపణలు నిరూపించాలంటూ ఆయన సవాల్ విసిరారు. తానెప్పుడూ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల నుంచి డబ్బు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తీసుకున్నానని నిరూపిస్తే.. తన కూతురు కావ్యను వరంగల్ ఎంపీ బరిలో నుంచి తప్పుకోమని చెబుతానని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను ఎప్పుడైనా.. వరంగల్ జిల్లా ప్రజలనే నమ్ముకున్నానని, నా వ్యక్తిత్వం గురించి ప్రజలకు పూర్తిగా తెలుసని అన్నారు.

ఇక బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌లో అప్పుడే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని కామెంట్ చేశారు. రాజకీయంగా తాను పెంచిన ఆరూరి చివరికి తనకే వెన్నుపోటు పొడుస్తున్నాడని పేర్కొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరూరి రమేష్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశానని గుర్తు చేశారు. బీజేపీకి దళితులు, ముస్లింలు అంటే గిట్టదంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చెబుతోందని, ఇక దళితుల పరిస్థతి ఏంటని ప్రశ్నించారు. కానీ, మళ్లీ అదే పార్టీలో చేరి ఆరూరి రమేష్ దళితులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన ఎస్సీ అయి ఉండి తన కూతరు పట్ల అనుచిన వ్యాఖ్యలు చేయడం బాధకరమని అన్నారు. దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదని స్పష్టం చేశారు. తండ్రిది ఏ కులమో.. అదే కులం కన్నబిడ్డకూ వర్తిస్తుందని తెలిపారు. నేను ఆరూరిలా భూ కబ్జాలకు పాల్పడలేదని, తన జీవితం ఓ తెరచిన పుస్తకమని అన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ తననే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆయనను ప్రస్తుతం ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదని కడియం శ్రీహరి తెలిపారు.



Next Story

Most Viewed