BREAKING : టెన్త్ ఫలితాలు విడుదల

by Disha Web Desk 4 |
BREAKING : టెన్త్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ టెన్త్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. పది ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు, బాలుర కంటే 3.81 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 3927 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 99 శాతం ఫలితాలతో నిర్మల్ జిల్లా టాప్‌లో నిలవగా.. 65.10 శాతం ఫలితాలతో చివరి స్థానంలో వికారాబాద్ నిలిచింది. ఇందులో 49.73శాతం ప్రైవేటు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 6 పాఠశాలలు సున్నా శాతం ఫలితాలు సాధించాయి. ఇక, జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. టెన్త్ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో బాలురు 2,7,952 మంది ఉండగా బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు.

ఫలితాల కోసం ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి..

https://www.bse.telangana.gov.in/




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed