- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే, బీజేపీ కార్పొరేటర్.. లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం
లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక వైపు బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ నాయకులు, కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు కలవడం హాట్ టాపిక్ మారింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆయన ఎందుకు సీఎంను కలుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దంపతులు కూడా సీఎంను కలిశారు. ఈ నేపథ్యంలో వీరు పార్టీ మారుతున్నారా.. లేక వారి ప్రాంత అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి కలిశారా.. అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.






