- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే: మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్
రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో లారీ డ్రైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో వారు వడ్ల రవాణాకు కూడా ముందుకు రావడం లేదని తెలిపారు. తడిసిన ధాన్యానికి మొలకలు రాక ముందే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు జీలుగు, జనుము విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని హరీష్ రావు డిమాండ్ చేశారు. అదేవిధంగా వడ్లతో పాటు మిగతా పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతుబంధు సాయాన్ని జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.






