Breaking News: కూకట్‌పల్లి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం

by Ramesh Naini |   (  Updated:2026-01-13 17:11:21  IST  )

కూకట్‌పల్లి పరిధిలోని ఓ గ్యాస్ రీ-ఫిల్లింగ్ సెంటర్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Breaking News: కూకట్‌పల్లి పరిధిలో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఓ గ్యాస్ రీ-ఫిల్లింగ్ సెంటర్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. రీఫిల్లింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో సుమారు ఎనిమిది గ్యాస్ సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో పాటు భారీగా మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

Next Story