- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. జింకకు గాయాలు
హైదరాబాద్‌లో గచ్చిబౌలి ప్రాంతంలో శనివారం ఓ జింక కారు ఢీకొన్న ఘటన కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఒక జింక రోడ్డుపైకి అకస్మాత్తుగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జింకకు గాయాలైనట్లు తెలిసింది.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలింపు
స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుంది. గాయపడిన జింకను పరిశీలించిన అనంతరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలిస్తూ చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. జింక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న రహదారుల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
Next Story






