BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణపై కవిత పిటిషన్, నేడు విచారణ

by Disha Web Desk 1 |
BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణపై కవిత పిటిషన్, నేడు విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీపై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం విధితమే. అయితే, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ ఆమె సీబీఐ విచారణను వ్యతిరేకించారు. కాగా, కవితను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని గత శుక్రవారం సీబీఐ ఢిల్లీ స్పెషల్ కోర్టును కోరింది. అందుకు స్పందించిన ఢిల్లీ స్పెషల్ కోర్టు.. తీహార్ జైలుకు వెళ్లి కవితను విచారించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం తీహార్ జైలుకు వెళ్లినా ఆమె సీబీఐ అధికారులకు సహకరించలేదు. ఆ మరునాడే అంటే శనివారం కేసులో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీబీఐకి విచారణ నిమిత్తం అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత ఇటీవలే సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. సీబీఐ తనను ప్రశ్నించడంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత పిటిషన్‌పై జవాబు చెప్పాల్సిందిగా సీబీఐకి స్పెషల్ కోర్టు నోటీసులు ఇచ్చింది.

Next Story

Most Viewed