Breaking : మరో ఘటన.. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

by Ramesh Naini |

రాష్ట్రంలో మరో స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది.

Breaking : మరో ఘటన.. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మరో స్కూల్‌లో ఫుడ్ పాయిజన్(Food Poisoning) ఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం తర్వాత పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో దాదాపు 20 మంది విద్యార్థినులు బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఈ మేరకు విద్యార్థులను అంబులెన్స్‌‌లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రెమరీ పాఠశాల(Government Primary School)లో ఫుడ్ పాయిజన్ జరిగింది.

మధ్యాహ్న భోజనం అనంతరం సుమారు 32 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న స్కూల్ టీచర్స్ చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో తరచుగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండ్రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై టీజీ హెచ్‌ఆర్సీ విచారణ చేపట్టింది.

Next Story