BREAKING: రైల్వే స్టేషన్ సమీపంలో తెగిపడిన విద్యుత్ తీగలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

by Kema Shiva Kumar |

మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడ్డాయి.

BREAKING: రైల్వే స్టేషన్ సమీపంలో తెగిపడిన విద్యుత్ తీగలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో కాగజ్‌నగర్-కాజీపేట్ మర్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు ట్రైన్లు కూడా ఆలస్యంగానే నడుస్తున్నాయని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది తెగి పడిన విద్యుత్ తీగలను పునరుద్ధరిస్తున్నారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Next Story