- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : ముగిసిన దావోస్ పర్యటన.. రేపు నగరానికి చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సమ్మిట్ నేటితో ముగియనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సమ్మిట్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో రేపు ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి బృందం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. దావోస్ వార్షిక సమ్మిట్‌లో భాగంగా తెలంగాణలో వివిధ దేశాల వ్యాపారవేత్తలు రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ మేరకు ఆయా దేశ, విదేశీ కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం పలు అగ్రిమెంట్లు కూడా చేసుకుంది. గతేడాది సమ్మిట్‌లో రూ.19,900 కోట్లు మాత్రమే వస్తే ఈ సారి అంతకు మించి రెండింతల పెట్టుబడులు రావడం శుభ పరిణామం. గడిచిన మూడేళ్లలో మొత్తం పెట్టుబడులను కలిపి పోల్చితే.. ఈ ఏడాది పెట్టుబడుల సంఖ్య చాలా అధికం.
Next Story






