- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
BREAKING : తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఆ స్థానం నుంచి పోటీ
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఇక, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తీన్మార్ మల్లన్న ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాగా జనగామ నుంచి ఆయన ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నను హస్తం పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించిన విషయం తెలిసిందే.
Next Story