- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇందిరమ్మ చీరల(Indiramma Sarees) పంపిణీకి బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో చీరల పంపిణీని ఎన్నికల సంఘం అధికారులు నిలిపివేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 44 లక్షల చీరలను పంపిణీ చేసింది. మొత్తం కోటి చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కాగా, గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుడులై.. నామినేషన్లు స్వీకరిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి నూతనోత్తేజంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. లోకల్ బాడీ ఎన్నికల కోసం ఎప్పటి నుంచో అధికార పార్టీ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు సిద్దం చేసుకుంటూ ఉన్నది. మూడు విడతలుగా జరుగనున్న ఈ ఎన్నికల్లో తొలివిడత డిసెంబర్ 11న, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి.






