T Congress: తెలంగాణ కేబినెట్ ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు బ్రేక్

by Prasad Jukanti |

మీనాక్షి నటరాజన్ తలపెట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది.

T Congress: తెలంగాణ కేబినెట్ ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు బ్రేక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ‘ప్రజల వద్దకు కాంగ్రెస్’ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తలపెట్టిన పాదయాత్ర (Padayatra) వాయిదా పడింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు ఆరు జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్ర, శ్రమదానం కోసం నిన్న టీపీసీసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గంలో 10 కి.మీ పాదయాత్రలో పాల్గొని ఆ రాత్రి అదే నియోజకవర్గంలో పల్లె నిద్ర, మరునాడు ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పల్లెల్లో శ్రమదానం చేసేలా ప్లాన్ చేశారు. తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తతలతో సమావేశమైన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకునేలా షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా ఆగస్టు 5,6,7 తేదీల్లో ఢిల్లీకి తరలి వెళ్లనున్నారు. దీంతో పాదయాత్ర సమయంలోనే రిజర్వేషన్ల విషయంపై ఢిల్లీ పర్యటనలు ఉండటంతో మీనాక్షి నటరాజన్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.

Next Story