- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమతులు.. అయోమయం
జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్ట ణ స్థానిక సంస్థల పరిధిలోని పలు భవ న నిర్మాణ అనుమతులకు బ్రేక్ పడిం ది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చే యడంతో ఇప్పుడు సర్కిళ్లుగా మారిపోయాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని పలు భవన నిర్మాణ అనుమతులకు బ్రేక్ పడింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఇప్పుడు సర్కిళ్లుగా మారిపోయాయి. విలీనం అయినట్టు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసిన మరుక్షణమే మారిపోయింది. మున్సిపల్ కా ర్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పర్మిషన్లు ఎవరు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కొంద రు దరఖాస్తుదారులు అధికారులను మే నేజ్ చేయించుకున్నవారైతే.. మరికొందరు ఏమీ చేయలేక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఇవ్వడానికి సాం కేతికపరమైన అంశాలను సెట్ చేయకముందే హెచ్ఎండీఏకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని బంద్ చేశారు.
అనుమతులు ఇలా...
జీహెచ్ఎంసీలో విలీనం అయిన 27 మున్సిపాలిటీల్లో కమిషనర్ల ద్వారా 1000 చదరపు గజాల స్థలంలో రెసిడెన్షియల్ భవనానికి నాలుగు ఫ్లోర్లు, క మర్షియల్ బిల్డింగ్‌కు ఐదు ఫ్లోర్లు అనుమతులు జారీ చేస్తున్నారు. ఆపై భవన నిర్మాణాలను హెచ్ఎండీఏ ద్వారా జా రీ చేస్తున్నారు. అయితే వీటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో వాటిని సర్కిళ్లుగా మార్చారు. దీంతో జీహెచ్ ఎంసీ పరిధిలో అయితే సర్కిల్ స్థాయి లో నాలుగు ఫ్లోర్లు, జోనల్ స్థాయిలో ఐదు ఫ్లోర్లకు మాత్రమే అనుమతులివ్వడానికి అధికారాలు ఉన్నాయి. ఆపై ని ర్మాణ అనుమతులన్నింటిని హెడ్ ఆఫీ సు స్థాయిలో ఇస్తున్నారు.
దరఖాస్తుదారుల్లో ఆందోళన
జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు జారీచేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చే యకపోవడంతోపాటు సాఫ్ట్‌వేర్‌ను సై తం అప్‌డేట్ చేయలేదు. దీంతో దరఖాస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీతోపాటు 27 యూఎల్బీలను 2వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణా న్ని వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాతనే అనుమతు లు జారీచేసే అవకాశముంది.
కొత్త మార్పులతో..
బిల్డ్‌నౌ యాప్‌ను నవీకరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టంట్ అప్రూవల్ మా డ్యూల్‌లలో అవసరమైన సాంకేతిక స వరణలు చేపట్టడంతో ఇకపై కొత్తగా దాఖలయ్యే దరఖాస్తులన్నీ పునర్నిర్దేశిత జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల ద్వారా స్వీకరించి పరిశీలించనున్నారు. విలీనానికి ముం దు వచ్చిన దరఖాస్తులు ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానానుసారంగా జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల ద్వారానే కొనసాగించి పరిష్కరించనున్నారు.






