- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు 13 వరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ లలో చేరదలిచిన అభ్యర్థులు ఆగస్టు 13లోపు దరఖాస్తు

X
దిశ, వనస్థలిపురం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ లలో చేరదలిచిన అభ్యర్థులు ఆగస్టు 13లోపు దరఖాస్తు చేయాల్సిందిగా వనస్థలిపురం హయత్‌నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేశ్‌బాబు, బీఆర్ఎవోయూ సెంటర్ కో-ఆర్డినేటర్ డా. ఎస్. నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కోర్సులకు సంబంధించి అర్హతలు, ఫీజు వివరాలు, ఇతర సమాచారం www.braouonline.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు తెలిపారు. ఇంటర్మీడియట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తిచేసినవారు, తెలంగాణ ఓపెన్ ఇంటర్ పాసైనవారు, అలాగే పాలిటెక్నిక్ లేదా రెండేళ్ల ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు నేరుగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 7382929771 నెంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
Next Story






