జూట మాటలకు బ్రాండ్ ‘కేసీఆర్’.. ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఎల్కతుర్తి (Elkaturthi) వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

జూట మాటలకు బ్రాండ్ ‘కేసీఆర్’.. ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్కతుర్తి (Elkaturthi) వేదికగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ (BJP) వైఖరి భబ్రాజమానం.. భజగోవిందం, శుష్కప్రియాలు.. శూన్యహస్తలంటూ సెటైర్లు వేశారు. 11 ఏళ్లు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ (BJP Government) ఏనాడు తెలంగాణ (Telangana) రాష్ట్రానికి అదనంగా నిధులు ఇచ్చిన పాపాన పోలేదని కామెంట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagaar) పేరుతో అక్కడున్న గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలకు తాము సిద్ధమేనంటూ మావోయిస్టులు (Maoists) కోరుతున్నారని.. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వెంటనే వారిని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపుతామని అన్నారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎల్కతుర్తి సభలో మాజీ సీఎం చెప్పిన ముచ్చట్లు అన్ని అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో తెలంగాణ ప్రభుత్వాని (Telangana Government)కి కేంద్రం రూ.10 కోట్లు నిధులు ఇచ్చిందని అన్నారు. దురదృష్టం కొద్ది మా పార్టీ వాళ్లు కరెక్ట్‌గా లేరని.. లేకపోతే తామే అధికారంలోకి వచ్చేవాళ్లమని తెలిపారు. కేసీఆర్ (KCR) అంటేనే జూటా మాటలకు బ్రాండ్ అని.. ఆ విషయాన్ని పలు‌మార్లు ఇప్పటికే నిరూపించుకున్నారంటూ సెటైర్లు వేశారు. ఆనాడు అసెంబ్లీ (Assembly) సాక్షిగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలు చెప్పాలని.. వాటిపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని కేసీఆర్‌ (KCR)ను ప్రశ్నించగా ఏం రాలేదంటూ అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదని.. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని రాజాసింగ్, కేసీఆర్‌కు చురకలింటంచారు.

Next Story