- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRAC: మంత్రి సీతక్కను కలిసిన బ్రాక్ ప్రతినిధులు.. పేద, వెనుకబడిన వర్గాల సాధికారతకు కృషి
సచివాలయంలో సోమవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను బ్రాక్ (BRAC) ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయంలో సోమవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను బ్రాక్ (BRAC) ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలోని అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో అమలవుతున్న తెలంగాణ ఇన్‌క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్ (TGILP) అమలు ప్రగతిపై ఈ సందర్భంగా వారు మంత్రికి నివేదిక అందజేశారు. బ్రాక్ సంస్థ సెర్ప్‌తో (SERP) కలిసి ఆదివాసీలు, జోగినీలు, ఇతర పేద కుటుంబాల ఆర్థిక సాధికారత కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎంపిక చేసిన పేద కుటుంబాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ప్రోత్సాహకాలు, లోన్లు, రాయితీలు అందించి, స్వయం ఆదాయ వనరులు సృష్టించేందుకు TGILP లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, మండల మహిళా సమాఖ్యల ద్వారా 108 మంది నిపుణులను నియమించి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తున్నట్లు బ్రాక్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు దీర్ఘకాలిక ఆదాయ మార్గాలు కల్పించి, వారిని ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకువెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో గ్రెగరీ చెన్ (Managing Director, Ultra Poor Graduation Initiative), శ్వేతా బెనర్జీ (India Lead), ఉషా రాణి (Programme Lead), వి. రమేశ్ (Senior Programme Officer), అభిషేక్ (Programme Associate) తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ కూడా మంత్రి సీతక్కతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






