- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలుడి ప్రాణం తీసిన బాటిల్ మూత.. ఇంతకీ ఏమైదంటే..?
కూల్ డ్రింక్ బాటిల్ మూత ఓ బాలుడిని బలిగొంది. నోట్ల పెట్టుకొని ఆడుకుంటుండగా గొంతులో ఇరుక్కొని మృతి చెందాడు.

దిశ, లక్షెట్టిపేట: కూల్ డ్రింక్ బాటిల్ మూత ఓ బాలుడిని బలిగొంది. నోట్ల పెట్టుకొని ఆడుకుంటుండగా గొంతులో ఇరుక్కొని మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీశ్ కథనం ప్రకారం.. లక్షిట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన గడికొప్పుల సురేందర్ తన భార్య, కూతురు, కుమారుడు రుద్రాయన్ (9నెలలు)తో కలిసి ఆదివారం సాయంత్రం కొమ్ముగూడంలోని తన బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ రుద్రయాన్ కూల్ డ్రింక్స్ బాటిల్ మూత నోట్లో పెట్టుకుని ఆడుకుంటుండగా.. గొంతులోకి వెళ్లింది. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు నోట్‌లో నుంచి మూత తీసి వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బాబు మృతిచెందినట్లు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.






