- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ డ్రైవర్‌పై బూతు పురాణం.. జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై ట్రాన్స్‌ఫర్
by Kema Shiva Kumar |
ఓ లారీ డ్రైవర్‌ను బూతులు తిడుతూ.. చేయిచేసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

X
దిశ, క్రైమ్ బ్యూరో: ఓ లారీ డ్రైవర్‌ను బూతులు తిడుతూ, చేయిచేసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రజల నుంచి పోలీసుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజకీయ ప్రముఖులు కూడా ట్రాఫిక్ ఎస్సై తీరు పట్ల తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. పోలీసు విధులు నిర్వహించే విధానంపై కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కామెంట్ చేశారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా స్పందించింది. లారీ డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారిపై చర్యలను తీసుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది. జీడిమెట్ల స్టేషన్ నుంచి బదిలీ చేయడంతో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఆఫీస్ స్పష్టం చేసింది.
Next Story






