BJP: జూబ్లీహిల్స్ లో బీజేపీ ఓటమికి కారణం అదే: బూరనర్సయ్య గౌడ్

by Prasad Jukanti |   (  Updated:2025-11-17 12:48:42  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బూరనర్సయ్య గౌట్ మాట్లాడారు.

BJP: జూబ్లీహిల్స్ లో బీజేపీ  ఓటమికి కారణం అదే: బూరనర్సయ్య గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ బలం కాదని ప్రత్యేక పరిస్థితుల ఫలితం మాత్రమేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.బూర నర్సయ్య గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఉన్న సానుభూతి, MIM సపోర్ట్, రూ.300 కోట్లు, ప్రలోభాలతో పాటు అజారుద్దీన్‌కు హడావుడిగా మంత్రి పదవి ఇవ్వడం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మోహరించడంతో పాటు అసత్య హామీలతో కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద గెలుపొందిందన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ 6 గ్యారెంటీల వైఫల్యం, 420 హామీలను ప్రజలు మరిచిపోయారనుకోవడం ఒక తప్పుడు భావన అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితి బలపడుతోందని చెప్పారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపో ఓటమో బీజేపీలో అది సమిష్టి బాధ్యత అని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. 42% BC రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కులగణన గణాంకాలను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని ఈఅవసరం అయితే సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తామన్నారు. ఒకే దేశం – ఒకే చట్టం న్యాయం ఉండాలన్నారు.

Next Story