సన్న వడ్లకు బోనస్... ఓ బోగస్: ప్రభుత్వంపై కవిత సెటైరికల్ ట్వీట్

by Kema Shiva Kumar |

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయించిన అన్నదాతలు బోనస్ బకాయిల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

సన్న వడ్లకు బోనస్... ఓ బోగస్: ప్రభుత్వంపై కవిత సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయించిన అన్నదాతలు బోనస్ బకాయిల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే, రాష్ట్రంలో మరో 10 రోజుల వ్యవధిలోన ఖరీఫ్ సీజన్ వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో గత యాసంగి సీజన్‌కు చెందిన సన్న ధాన్యం బోనస్ బకాయిలు ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సన్న వడ్ల బోనస్ బకాయిలపై తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. బోనస్... బోగస్ అని వరి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్.. ఇది ఎన్నికల హామీ.. సోనియమ్మ గ్యారెంటీ అంటూ ఎద్దేవా చేశారు.

సన్న వడ్లకు మాత్రమే బోనస్.. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ సర్కారు (Congress Government) వంచనకు ప్రతిరూపమంటూ ఫైర్ అయ్యారు. సన్నవడ్లు పండించాలంటే రైతులకు ఎన్నో ప్రయాసలు, అదనపు పెట్టుబడి, అంతకు మించిన కష్టాలు పడ్డారని వాపోయారు. సర్కారు బోనస్ ఇస్తుందనే నమ్మకం సన్న వడ్లు సాగు చేసిన రైతులకు మళ్లీ కాంగ్రెస్ మార్క్ మోసమే ఎదురైందని ధ్వజమెత్తారు. యాసంగి సీజన్‌లో సన్న వడ్లు అమ్మిన రైతులకు 3 నెలలు గడిచినా పైసా బోనస్ ఇవ్వలేదన్నారు. ఇంకొన్ని రోజుల్లో వానాకాలం పంట కోతలు మొదలైతయ్.. అయినా యాసంగి బోనస్ రైతులకు ఇవ్వలే.. సోనియమ్మ గ్యారెంటీకి కాంగ్రెస్ సర్కారు మంగళం పాడేసిందని ఆరోపించారు. రైతులకు బోనస్ (Bonus) ఇచ్చే వరకు వారి తరపున తెలంగాణ జాగృతి పోరాటాన్ని కొనసాగిస్తుందని కవిత ట్వీట్ చేశారు.

Next Story