జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై బొంతు రామ్మోహన్ క్లారిటీ

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్(Bonthu Rammohan) బరిలోకి దిగబోతున్నారనే వార్తలు విస్తృతం అయిన విషయం తెలిసిందే.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై బొంతు రామ్మోహన్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్(Bonthu Rammohan) బరిలోకి దిగబోతున్నారనే వార్తలు విస్తృతం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై బొంతు రామ్మోహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను కాంగ్రెస్‌(Congress)లోనే ఉన్నాను.. ఉంటాను అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ తరపున పోటీ చేయబోతున్నాను అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. అవి వట్టి పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. నా అభ్యర్థిత్వంపై బీజేపీలో జరుగుతున్న అంతర్గత చర్చతో నాకు సంబంధం లేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని స్పష్టం చేశారు. కాగా, తనకు కాంగ్రెస్ నుంచి టికెట్‌ కావాలని కూడా ఎవర్నీ అడగలేదని, అధిష్టానమే అభ్యర్థిని నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్‌ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.

Next Story